News May 30, 2024

స్కూళ్లలో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్

image

AP: రాష్ట్రంలోని 352 KGBVలు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో 9వ తరగతి విద్యార్థులకు ‘స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌’ను విద్యాశాఖ అమలు చేయనుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు కొద్దిరోజులు పంపుతుంది. కొత్త విద్యార్థులతో మాట్లాడటం, విద్యావిధానాలను తెలుసుకోవడం ద్వారా వారి ఆలోచనా పరిధి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు జూన్ 15 నుంచి దరఖాస్తులు మొదలవుతాయి.

Similar News

News February 19, 2026

సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News February 19, 2026

ప్రతి జిల్లా కాంప్లెక్స్‌లో తెలంగాణ తల్లి విగ్రహం

image

TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సుల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 33 జిల్లా కేంద్ర కార్యాలయ భవనాల కాంప్లెక్సుల్లో వీటి ఏర్పాటుకు రూ.5.80 కోట్ల విడుదలకు పాలనా అనుమతి జారీచేసింది.

News February 19, 2026

తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

image

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్‌డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.