News November 21, 2024
₹కోటి ఇవ్వాలంటూ ‘అమరన్’ మేకర్స్‌కు స్టూడెంట్ నోటీసులు

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మేకర్స్‌కు ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ లీగల్ నోటీసులు పంపించారు. తన అనుమతి లేకుండా సినిమాలో తన ఫోన్ నంబర్ చూపించారని, దీంతో తనకు గుర్తు తెలియని వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. తనకు నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 8, 2025
25 ఏళ్ల నాటి పాలసీల వల్లే TGకి ఆదాయం: CBN

AP: విభజనతో APకి వ్యవస్థీకృత సమస్యలు వచ్చాయని CBN చెప్పారు. వీటిని సరిచేస్తుండగా YCP వచ్చి విధ్వంసం చేసిందని విమర్శించారు. ‘2 తెలుగు స్టేట్స్ అభివృద్ధే నా ఆకాంక్ష. TGకి 25 ఏళ్లక్రితం నాటి పాలసీల వల్ల ఆదాయం వస్తోంది. YCP రుణాల్ని రీషెడ్యూల్ చేస్తున్నాం. తినే పంటలు పండిస్తేనే ఆదాయం. బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో అగ్రిటెక్‌ను అమల్లోకి తెస్తున్నాం. 9 జిల్లాలను ఉద్యాన క్లస్టర్‌గా చేస్తున్నాం’ అని తెలిపారు.
News December 8, 2025
ఏక పంట విధానం.. అన్నదాతకు నష్టం

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 8, 2025
సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకపై సూపర్ ఓవర్లో త్రిపుర థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 197/6 స్కోర్ చేయగా, త్రిపుర 197/8 చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో TRI 22 రన్స్ చేయగా, KA 18/1 స్కోర్ మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ ఆల్‌రౌండ్(35 బంతుల్లో 69 పరుగులు, 2 వికెట్లు; సూపర్ ఓవర్లో 5 రన్స్, 1 వికెట్) ప్రదర్శనతో అదరగొట్టారు.


