News September 21, 2025
స్టూడెంట్స్.. టెన్షన్ వద్దు!

H1B వీసా ఫీజులను లక్ష డాలర్లకు <<17779352>>పెంచడంతో<<>> అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులు ఉద్యోగాలు రావని ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాకు F1 వీసాపై వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తే 12 నెలల పాటు అక్కడ ఉండవచ్చు. మరో 24 నెలలు OPT ఎక్స్‌టెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే చదువు పూర్తయిన మూడేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ లోగా ట్రంప్ ప్రభుత్వం మారి H1B రూల్స్ మారొచ్చు.
Similar News
News September 21, 2025
వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News September 21, 2025
BSFలో 1121 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు

<
News September 21, 2025
25న డీఎస్సీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ

AP: మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నియామక పత్రాలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే సమయంపై క్లారిటీ ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అభ్యర్థులకు అందిస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ నెల 19న జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది.