News February 28, 2025
విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదు: స్టాలిన్

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్ టంగ్‌తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టు కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటే చాలు’ అని ట్వీట్ చేశారు. కాగా, NEPలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
Similar News
News September 17, 2025
TODAY HEADLINES

★ ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టుల ప్రకటన
★ రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది ప్రశంసలు
★ ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం రేవంత్ ఆగ్రహం
★ 15% వృద్ధి రేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
★ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో కాంగ్రెస్ ఎంపీల ఓట్లను రేవంత్ అమ్ముకున్నారు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
★ వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ
★ పంటల ధరల పతనంలో చంద్రబాబు రికార్డు: YS జగన్
News September 17, 2025
‘నా మిత్రుడు ట్రంప్’కు ధన్యవాదాలు: PM మోదీ

ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం అమెరికా చేసే చొరవలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
News September 17, 2025
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు

TG: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. ‘కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం’ అని సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.