News October 22, 2024
విద్యార్థుల ఫుట్ బోర్డు ప్రయాణం.. స్పందించిన TGSRTC

రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో కొందరు విద్యార్థులు <<14425042>>ఫుట్ బోర్డు ప్రయాణం<<>> చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని, ఫుట్ బోర్డు ప్రయాణం చేయకుండా సహకరించాలని కోరారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<