News February 13, 2025
లగ్జరీ కార్లతో స్టూడెంట్స్ రచ్చ.. షాకిచ్చిన పోలీసులు

గుజరాత్ సూరత్లోని ఓ స్కూల్కు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఇటీవల ఫేర్వెల్ పార్టీకి 35 లగ్జరీ కార్లతో వచ్చి <<15425002>>హల్చల్ చేశారు<<>>. లైసెన్సు లేకుండా కారు నడపడమే కాకుండా స్టంట్లు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు వైరలవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. 22 కార్లను సీజ్ చేశామని, మరికొన్ని కార్లను గుర్తిస్తున్నామని DCP బరోత్ వెల్లడించారు.
Similar News
News October 24, 2025
ప్రపంచబ్యాంకు నుంచి అమరావతికి మరో ₹1,750 కోట్లు!

AP: అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు రెండో విడతగా ₹1,750 కోట్లు ఇవ్వనుంది. డిసెంబర్ నాటికి ఈ ఫండ్స్ వచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ తెలిపారు. ‘తొలి విడతలో WB విడుదల చేసిన ₹1,800 కోట్లలో 50% ఖర్చు చేశాం. ఇందులో 75% పూర్తయ్యాక రెండో విడత కోసం దరఖాస్తు చేస్తాం’ అని చెప్పారు. అమరావతి ప్రాజెక్టులకు ₹13,600 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని గతంలో వరల్డ్ బ్యాంక్, ADB ప్రకటించాయి.
News October 24, 2025
విగ్రహంలో దేవుడు ఉంటాడా?

భగవంతునికి చంచల, నిశ్చల అనే రెండు రూపాలున్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో చలనము లేని రూపమే విగ్రహం. ఈ రూపంలో కూడా పరమాత్మ నిత్యం కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విగ్రహాన్ని రాతిగా చూడరాదని అంటుంటారు. భక్తుల కోసం, భక్తుల ఆరాధన కోసం భగవంతుడు తన లీల ద్వారా ఈ రూపంలో కొలువై ఉంటాడట. భక్తులచే పూజలందుకొని అనుగ్రహాన్ని కల్పిస్తాడట. విగ్రహంలో దేవుడు లేడన్న మాట అవివేకం. <<-se>>#WhoIsGod<<>>
News October 24, 2025
చిన్నారుల్లో హెయిర్ ఫాల్ అవుతోందా?

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారం పెట్టడంతో పాటు జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం మానుకోవాలంటున్నారు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గాక కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.


