News February 28, 2025
దేశ ప్రగతి, ఆవిష్కరణల్లో విద్యార్థులదే కీ రోల్: రాజ్‌నాథ్

TG: వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. తాను కూడా కొన్నాళ్లు సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఆయన ప్రసంగించారు. దేశ ప్రగతి, ఆవిష్కరణల్లో విద్యార్థులదే కీలక పాత్ర అని తెలిపారు. దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రక్షణ రంగంలోనూ అనేక మార్పులొస్తున్నాయని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
HYD: 2047 అంచనాలతో సీవరేజ్ డిజైన్!

ORR వరకు ఉన్న ప్రాంతాలు సైతం జలమండలిలోకి రావటంతో విస్తీర్ణం భారీగా పెరిగింది. అయితే ఆయా ప్రాంతాల్లో సీవరేజ్ నెట్వర్క్ అంతగా లేదు. దీనిని గుర్తించిన జలమండలి 2047 వరకు నగరంలో పెరిగే జనాభా ప్రాతిపదికన డీటెయిల్డ్ డ్రైనేజీ సిస్టం ప్లానింగ్ రూపొందిస్తున్నట్లుగా తెలిపింది. ఈ సిస్టం పూర్తి చేయడానికి రూ. వేలాది కోట్లు ఖర్చుకానున్నాయి.
News December 4, 2025
S-500 గురించి తెలుసా?

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్‌గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.
News December 4, 2025
రాష్ట్రంలో 4 వేల ఖాళీలు!

TG: ఎస్సీ గురుకుల సొసైటీలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా TGSWREISకు 9,735 మంది పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు శాఖల్లో అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కలిపి 4,725 ఖాళీలు ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖను కోరితే 4వేలకు అనుమతిచ్చిందని సమాచారం.


