News June 20, 2024

విద్యార్థులు సైంటిస్టులుగా మారేలా ప్రోత్సాహం అందించాలి: పవన్

image

AP: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైన్స్& టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని చెప్పారు. రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 4, 2026

రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

image

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. వీరు రేపు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారుగా ఉన్నారు.

News March 4, 2026

DMKతో పొత్తు ఖరారు.. 28 సీట్లలో కాంగ్రెస్ పోటీ

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పలుమార్లు చర్చలు, చిదంబరం-స్టాలిన్ భేటీ అనంతరం రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాంగ్రెస్‌కు 28 స్థానాలు కేటాయించేందుకు DMK అంగీకరించింది. అలాగే ఓ రాజ్యసభ సీటును ఇవ్వనుంది. 234 సీట్లున్న TN అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

News March 4, 2026

గ్యాస్ ఉత్పత్తిని నిలిపేస్తున్నాం: ఖతర్

image

లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టుల ఉత్పత్తిని <<19269644>>నిలిపేస్తున్నట్లు<<>> ఖతర్ ప్రకటించింది. ‘గ్యాస్‌ను లిక్విడ్‌గా మార్చే ప్రక్రియను ఆపేస్తున్నాం. నెల రోజులు సూపర్ చిల్డ్ గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి చేయలేం’ అని చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. గ్లోబల్ LNG ఎగుమతుల్లో ఖతర్‌ వాటా 20%. తాజా నిర్ణయంతో ఇండియా, జపాన్, చైనా, యూరప్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి.