News January 2, 2025

300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థుల అనుమానం!

image

TG: CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ <<15041575>>కేసులో<<>> కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవి SMలో లీక్ అయితే MLA మల్లారెడ్డే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.

Similar News

News January 21, 2026

FLASH: పెరిగిన వెండి ధర

image

ఇవాళ ఉదయం నుంచి తటస్థంగా ఉన్న వెండి ధర మధ్యాహ్నం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.3,45,000కు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,474గా ఉంది.

News January 21, 2026

పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

image

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.

News January 21, 2026

APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<>CUTN<<>>)లో 13 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cutn.ac.in/