News September 24, 2024

పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు!

image

AP: పల్నాడు(D) వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.

Similar News

News September 24, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి రేపు అనౌన్స్‌మెంట్: తమన్

image

రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రేపు ఓ అనౌన్స్‌‌మెంట్ రానున్నట్లు తెలిపారు. కాగా అది రెండో సాంగ్ గురించేనని, ఈ నెల 27న దాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. DEC 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

News September 24, 2024

భీకర యుద్ధం: 500కు చేరిన మృతుల సంఖ్య

image

హెజ్‌బొల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 500 మందికిపైగానే మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు 100కుపైగా ఉన్నారు. 1,650 మందికిపైగా గాయపడ్డారు. 2006 తర్వాత లెబనాన్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2006లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1,300 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

News September 24, 2024

బతుకమ్మ గిఫ్ట్.. రూ.500?

image

గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం వాటి స్థానంలో నగదు అందించేందుకు యోచిస్తోంది. రూ.500 లేదా ఆపైనే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో వేయాలా? లేక నేరుగా చేతికి ఇవ్వాలా? అనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది.