News July 17, 2024
ప్రయోగాల ఖర్చు తగ్గిస్తామంటున్న విద్యార్థులు!

AP: అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించేలా శ్రీకాకుళంలోని డా.BR.అంబేడ్కర్ వర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రీలాంచ్ రాకెట్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే లాంచింగ్‌లో సక్సెస్ అయ్యామని, తర్వాత 100M పైకి పంపిస్తామన్నారు. ఇంధనంగా అమ్మోనియం పెర్క్లోరేట్ కాంపోజిట్ ప్రొపెల్లెంట్, రాకెట్ నమూనాకు 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడారట. దీంతో వాతావరణ పర్యవేక్షణ చేస్తారట. వారు ఆర్థిక ప్రోత్సాహం కోరుతున్నారు.
Similar News
News December 31, 2025
సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు.. కారణమిదే!

UPలోని మథురలో జరగాల్సిన సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దయింది. పవిత్రమైన శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సన్నీలియోన్‌తో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు పెద్దఎత్తున ప్రచారం చేశారు. టికెట్లూ అమ్మారు. అయితే సాధువులు, మత సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈవెంట్ రద్దయింది.
News December 31, 2025
డిసెంబర్ 31: చరిత్రలో ఈరోజు

✒1600: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు
✒1928: తెలుగు సినిమా నటుడు, మాజీ MP కొంగర జగ్గయ్య జననం
✒1953: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి జననం (ఫొటోలో)
✒1965: భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి VP మేనన్ మరణం
✒2020: తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మరణం
News December 31, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


