News December 22, 2025

Study Curse: మూడేళ్ల కోర్స్ vs మూణ్నెళ్ల కోర్స్

image

మన క్వాలిఫికేషన్ ఏదైనా అమీర్‌పేటలో 3 నెలలు కోచింగ్‌తో ఆర్నెళ్లలో IT జాబ్ పక్కా. మనం మాట్లాడుకునేది అమీర్‌పేట లేదా కోచింగ్ సెంటర్ల ఘనతపై కాదు. అలా జాబ్ ఇచ్చే కోర్సులు కాలేజ్ సబ్జెక్టులుగా ఎందుకుండవు అనే. బేసిక్స్ చెప్పే స్కూల్, ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ చదివితే జాబ్ వస్తుందా అంటే నో గ్యారంటీ. ట్రెండ్, మార్కెట్ అవసరాలకు తగ్గట్లు అప్డేట్ కాని చదువు మనకు అంటగట్టడం ఎందుకు? ఏమంటారు ఫ్రెండ్స్?

Similar News

News December 24, 2025

భారత్‌తో సయోధ్య.. పాక్‌కు ఆయుధాలు: చైనా వ్యూహంపై US నివేదిక

image

భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకుంటూ ద్వైపాక్షిక సంబంధాలను ఇంప్రూవ్ చేసుకునేందుకు చైనా యత్నిస్తున్నట్లు అమెరికా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో FC-31, J-10C, JF-17 వంటి యుద్ధ విమానాలతో పాటు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూరుస్తూ పాకిస్థాన్‌తో సైనిక సంబంధాలను మెరుగుపర్చుకుంటోందని తెలిపింది. అయితే, గత అనుభవాల దృష్ట్యా భారత్ మాత్రం చైనాతో సంబంధాల పురోగతిలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడింది.

News December 24, 2025

జీడిమామిడిలో అంతర పంటల వల్ల లాభమేంటి?

image

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్‌ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.

News December 24, 2025

2025లో రూపాయి ప్రయాణం సాగిందిలా!

image

2025 జనవరిలో 85.80 వద్ద ప్రయాణం స్టార్ట్ చేసిన రూపాయి పడిపోతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ మార్చి, ఏప్రిల్‌లో ఒకటి రెండుసార్లు 85.4 స్థాయికి చేరింది. దీంతో కాస్త ఊరట దక్కుతుందని భావించినా నిరాశే మిగిలింది. మే 5, 12 తేదీల్లో 84 మార్క్‌ను తాకి మరోసారి ఆశలు పెంచింది. అనంతరం రికార్డు స్థాయిలో పడిపోతూ డిసెంబర్ 16వ తేదీన ఆల్ టైమ్ హై 90.95 వద్దకు చేరుకుంది. ఈరోజు (డిసెంబర్ 24) 89.47గా ఉంది.