News July 8, 2024

సచివాలయ వ్యవస్థపై త్వరలో అధ్యయనం: మంత్రి స్వామి

image

AP: తమపై పనిభారం పెరిగిపోతోందని వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామిని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు కలిశారు. టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్న వారిని స్కూళ్లు, కాలేజీల్లో సాంకేతిక విధుల కోసం వినియోగించుకోవాలని కోరారు. సచివాలయ వ్యవస్థపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి వారి విజ్ఞప్తిపై బదులిచ్చారు.

Similar News

News October 22, 2025

పొద్దున నిద్ర లేవగానే ఇలా చేస్తే.. అన్నీ శుభాలే!

image

ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని దర్శిస్తే ఆ రోజంతా శుభాలు కలుగుతాయి. అరచేతుల్లో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పొద్దున్నే వాటిని చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం.. తులసి మొక్కను చూస్తే, ముల్లోకాలలోని పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. గోవు, అగ్నిహోత్ర దర్శనం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఈ నియమాలను పాటిస్తే.. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు.

News October 22, 2025

పరమ శివుడికి ఇష్టమైన మాసం

image

కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులు పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. ఈ మాసంలో తెల్లవారుజామున నదీ స్నానాలు చేసి దేవాలయాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో తులసి కోట, దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిదని అంటున్నారు. కార్తీక మాస వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా అన్నదానం, వస్త్ర దానం, గోదానం చేస్తే పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

News October 22, 2025

కార్తీక మాసంలో దీపాల విశిష్ఠత

image

కార్తీక మాసంలో సూర్యుడు తుల-వృశ్చిక రాశుల్లో, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో సూర్యకాంతి తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వగా అవుతూ చీకటి దట్టంగా ఉంటుంది. అప్పుడు మన శరీరమూ కాస్త బద్దకిస్తుంది. చీకట్లను పారదోలడంతోపాటు మన శక్తి పుంజుకునేందుకు దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించడం శుభప్రదమంటున్నారు.