News October 21, 2024

SU వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమేశ్ కుమార్

image

శాతవాహన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే ఉన్నతమైన విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో నిలుపుతానని వైస్ ఛాన్సలర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయం VC ఆయన పదవీ భాద్యతలు చేపట్టారు. అంతకు ముందు యూనివర్సిటీ అధికారులు సిబ్బంది ఆయన కి ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనల మధ్య పదవీ బాధ్యతలు చేపట్టారు.

Similar News

News November 10, 2024

మెట్‌పల్లి ఎమ్మెల్యేగా జ్యోతి నియంతృత్వ పాలనను ఎదిరించారు: MLC

image

మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నియంతృత్వ పాలనను ఎదురించడంలో ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి తమతో పాటు ఎమ్మెల్యేగా జ్యోతి ముందు వరుసలో ఉండేదని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. శాసనసభలోనే కాకుండా అన్ని రంగాలలో మహిళల హక్కుల కోసం జ్యోతి పోరాటం చేసారన్నారు.

News November 10, 2024

సీఎం, మంత్రి వెంకట్ రెడ్డిపై కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లను దూషించిన సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

News November 10, 2024

నేడు దద్దరిల్లనున్న పెద్దపల్లి!

image

పెద్దపల్లిలోని జెండా చౌరస్తా వద్ద ఈరోజు సాయంత్రం 4 గంటలకు అఖిల భారత యాదవ సంఘం, యువజన విభాగం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న ఉత్సవానికి రాజకీయ, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.