News August 8, 2024
తెలంగాణలో రేషన్ కార్డులపై సబ్‌కమిటీ
TG: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా మంత్రులు దామోదర రాజ నర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.
Similar News
News January 18, 2025
TODAY HEADLINES
✒ FEB 1న కేంద్ర బడ్జెట్.. 2 విడతలుగా సమావేశాలు
✒ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ₹11,440Cr ప్యాకేజీ
✒ AP: తనతో భేటీకి MPల గైర్హాజరు.. CBN ఆగ్రహం
✒ AP: పేదలకు పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు
✒ IPS సునీల్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
✒ సింగపూర్ మినిస్టర్‌తో CM రేవంత్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
✒ 100% రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా: KTR
✒ పాత రేషన్ కార్డులు తొలగించం: మంత్రి పొన్నం
News January 18, 2025
పెళ్లి చేసుకున్న శ్రీలంక క్రికెటర్
శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి అర్తికా యోనాలీని వివాహం చేసుకున్నారు. కొలొంబో వేదికగా జరిగిన ఈ వేడుకకు ఆ దేశ క్రికెటర్లు హాజరయ్యారు. IPL-2023, 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను 27 మ్యాచ్‌లలో 25 వికెట్లు తీశారు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్‌కు ఆడనున్నారు. శ్రీలంక తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 135 వికెట్లు పడగొట్టారు.
News January 18, 2025
పూర్తిగా కోలుకున్న విశాల్
ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్‌లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.