News March 21, 2024
ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా సుబియాంటో
ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో పదవీ కాలం ముగియడంతో సుబియాంటో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. కాగా సుబియాంటోకు 58.6 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి అనీస్ బస్వేదర్‌కు 24.9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. గత నెల 14న ఎన్నికలు జరగగా ఇప్పుడు ఫలితాలు వెల్లడయ్యాయి.
Similar News
News November 25, 2024
IPL వేలంలో వెంకటేశ్ అరుదైన రికార్డు
IPL హిస్టరీలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్ నిలిచారు. అతడిని KKR ₹23.75crకు సొంతం చేసుకుంది. నిన్నటి వేలంలో అది మూడో అత్యధిక ధర. 2023లో సామ్ కరన్ ₹18.5cr(PBKS), గ్రీన్ ₹17.5cr(MI), స్టోక్స్ ₹16.25cr(CSK), 2021లో మోరిస్ ₹16.25cr(RR) ధర పలికారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యను MI ₹16.35 కోట్లకు, జడేజాను CSK ₹18 కోట్లకు, అక్షర్ పటేల్‌ను DC ₹16.5 కోట్లకు రిటైన్ చేసుకున్నాయి.
News November 25, 2024
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు: 29 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. బీరూట్‌లోని ఓ బిల్డింగుపై వరుసగా ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. భీకరమైన ఈ దాడుల్లో 29 మంది మరణించారు. హెజ్బొల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ యూనిట్, మిసైల్ యూనిట్, ఆయుధాలను స్మగ్లింగ్ చేసే 4400 యూనిట్ సహా 12 కమాండ్ సెంటర్లను నాశనం చేశామని IDF ప్రకటించింది. తమ దేశంపై టెర్రరిస్టు దాడుల ప్లానింగ్, కమాండ్, అమలుకు వీటిని వాడేవాళ్లని తెలిపింది.
News November 25, 2024
ఈరోజు ఉ.10 గంటలకు..
AP: తిరుమల శ్రీవారి దర్శన, గదుల టికెట్లను నేడు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను ఉ.10 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. అలాగే ఫిబ్రవరి కోటా గదుల టికెట్లను ఈరోజు మ.3 గంటలకు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవలు, దర్శనం, వసతి కోటా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.