News July 4, 2024

నీట మునిగిన కజిరంగా నేషనల్ పార్క్

image

అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 23 జిల్లాలు వరద ప్రభావానికి గురి కాగా 2,90,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇటు కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌ కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News April 10, 2026

ఎండాకాలం.. వేడి సీటుపై కూర్చుంటున్నారా?

image

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడానికి ‘వేడి’ ప్రధాన శత్రువు. హెల్తీ స్పెర్మ్ కోసం వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2°C- 3°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడం, టైట్ జీన్స్ ధరించడం, వేడి సీట్లపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వీర్యకణాల నాణ్యత, కదలిక మందగిస్తాయి. ల్యాప్‌టాప్‌ను నేరుగా ఒడిలో పెట్టుకోకండి. కాటన్ లోదుస్తులు ధరించండి. బైక్ సీటు చల్లబడిన తర్వాతే కూర్చోండి.

News April 10, 2026

నా ఇన్నింగ్స్ ధోనీకి అంకితం: ముకుల్

image

మరో యువ క్రికెటర్‌కు MS ధోనీ స్ఫూర్తిగా నిలిచారు. నిన్న KKRపై విధ్వంసం సృష్టించిన LSG యంగ్ స్టార్ ముకుల్ చౌదరి తన అద్భుత ఇన్నింగ్స్‌ను ధోనీకి డెడికేట్ చేశారు. ‘నేను ధోనీ బ్యాటింగ్ చూస్తూ పెరిగాను. నేను ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లోనే వస్తాను. నా కెరీర్ ఆరంభంలో ఆయనే నాకు అతిపెద్ద ఇ‌న్‌స్పిరేషన్’ అని చెప్పారు. అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ముకుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

News April 10, 2026

ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుందా?

image

TG: రాష్ట్రంలో RTC సమ్మె సైరన్ మోగేలా కన్పిస్తోంది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తెలంగాణ RTC జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 23న సమ్మెకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. 13వ తేదీ లేబర్ కమిషనర్, RTC యాజమాన్యంతో చర్చిస్తామని నేతలు తెలిపారు. కాగా నిన్న HYDలో లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.