News July 2, 2024

నీటిలో మునిగినా డయాఫ్రం వాల్‌కు ఏమీకాదు: నిపుణులు

image

AP: పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద ప్రవహించినా ఏమీ కాదని అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. నీళ్లలో ఉంటే కట్టడం దెబ్బతింటుందనే ఆలోచనని సరికాదన్నారు. దీనికి మరో కట్టడాన్ని అనుసంధానించినా సమస్య ఉండదని పేర్కొన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ పటిష్ఠతపై మరికొన్ని పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. నేడు, రేపు సమీక్షలు నిర్వహించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

Similar News

News September 16, 2025

శుభ సమయం (16-09-2025) మంగళవారం

image

✒ తిథి: బహుళ దశమి రా.2.51 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 వరకు
✒ శుభ సమయములు: సా.5.10-సా.6.10
✒ రాహుకాలం: మ.3.00-మ.4.30
✒ యమగండం: ఉ.9.30-మ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: రా.10.08-రా.11.38
✒ అమృత ఘడియలు: ఏమీ లేవు

News September 16, 2025

TODAY HEADLINES

image

* యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ.800 ఇస్తాం: చంద్రబాబు
* కాలేజీల యాజమాన్యాలతో TG ప్రభుత్వం చర్చలు సఫలం
* చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం: PM మోదీ
* మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్
* బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా
* వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
* ఆసియా కప్‌లో సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

News September 16, 2025

వక్ఫ్ చట్టంపై SC ఉత్తర్వులను స్వాగతించిన KTR

image

TG: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర <<17717100>>ఉత్తర్వులను<<>> మాజీ మంత్రి KTR స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలను BRS మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ‘చట్టంలోని సమస్యలపై మేం పోరాడాం. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి. ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు’ అని ఆయన అన్నారు.