News May 25, 2024

‘CCTV లింక్’పై వివరాలు సమర్పించండి.. ECకి హైకోర్టు ఆదేశం

image

AP: స్ట్రాంగ్ రూంలకు అన్ని వైపులా CCకెమెరాలు ఏర్పాటు చేయాలంటూ వచ్చిన వినతులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ECని హైకోర్టు ఆదేశించింది. స్ట్రాంగ్ రూంలను పర్యవేక్షించేందుకు అభ్యర్థులకు కూడా CCTV లింక్‌ను ఇవ్వడంపై పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతపై తగిన చర్యలు తీసుకునేలా ECని ఆదేశించాలంటూ కేఏ పాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Similar News

News January 19, 2026

‘క్వాంటమ్’ కోర్సులో 50,000 మంది AP యువత

image

AP: క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సుకు రాష్ట్ర యువత నుంచి అధిక స్పందన లభిస్తోంది. NPTEL ప్లాట్‌ఫామ్ ద్వారా మద్రాస్ IIT, IBM అందిస్తున్న ఈ కోర్సులో 50,000 మంది ఎన్రోల్ అయ్యారు. దేశంలోనే AP ఈ అంశంలో ముందంజలో ఉంది. అటు IITల సహకారంతో 7-9 తరగతుల్లో క్వాంటమ్ పరిజ్ఞానంపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఈకోర్సులో గోల్డ్, సిల్వర్ మెడలిస్టులను సత్కరించనున్నామని CBN Xలో పేర్కొన్నారు.

News January 19, 2026

గణతంత్ర పరేడ్‌లో కీరవాణి నాదం.. తెలుగు వ్యక్తికి దక్కిన గౌరవం!

image

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత కీరవాణి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరనుంది. ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించే బాధ్యతను ఆయన చేపట్టనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 2500 మంది కళాకారులు ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగం కానున్నారు. ఈ విషయాన్ని కీరవాణి X వేదికగా వెల్లడించారు.

News January 19, 2026

ముంబై మేయర్ పీఠం BJPకి దక్కేనా?

image

ముంబై మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపోల్స్‌ ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన BJPకి మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 227 వార్డుల్లో బీజేపీ (89), శివసేన (29) కూటమి 118 సీట్లు సాధించింది. 28న జరిగే కౌన్సిలర్ల మీటింగ్‌లో మేయర్‌ను ఎన్నుకోనున్నారు. శివసేన (UBT) 65, MNS 6, కాంగ్రెస్ కూటమి 24, AIMIM 8, మిగిలిన చోట్ల ఇతరులు విజయం సాధించారు.