News August 16, 2024

రాహుల్ పౌర‌స‌త్వం ర‌ద్దుపై హైకోర్టుకు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి

image

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో తాను చేసిన విజ్ఞ‌ప్తిపై కేంద్ర హోం శాఖ‌ తగిన చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పటిదాకా తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించేలా హోం శాఖ‌కు ఆర్డర్స్ ఇవ్వాలని పిటిష‌న్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిష‌న్ వ‌చ్చే వారం విచార‌ణ‌కు రానుంది.

Similar News

News July 6, 2025

బ్లాక్ మార్కెట్ దందాపై విచారించాలి: KTR

image

TG: కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులకూ కరువొచ్చింది. రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటమేంటి? యూరియా బస్తా ధర ₹266.50 నుంచి ₹325కు ఎందుకు పెరిగింది? ఈ బ్లాక్ మార్కెట్‌ను నడిపిస్తుంది ఎవరు? ప్రభుత్వం విచారించాలి’ అని డిమాండ్ చేశారు.

News July 6, 2025

మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

image

TG: NZB(D) బోధన్(మ) మినార్‌పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2025

బిహార్‌ను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు: రాహుల్ గాంధీ

image

BJP, CM నితీశ్ కలిసి బిహార్‌ను భారతదేశ క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పట్నాలో <<16949011>>గోపాల్ ఖేమ్కా హత్య<<>> ద్వారా ఇది మరోసారి రుజువైందన్నారు. ‘బిహార్‌లో నేరాలు సాధారణంగా మారినా అసమర్థ ప్రభుత్వం ఏం చేయట్లేదు. భద్రత ఇవ్వలేని వారికి మీ భవిష్యత్తును అప్పగించొద్దు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బిహార్‌ను కాపాడేందుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.