News September 22, 2025

ప్రైవేటుగా పరువాల విందు!

image

SMలో ఇప్పుడు చాలామంది మహిళా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు చేస్తున్న వ్యాపారం ఇదే. ‘ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి’ అంటూ బోల్డ్ ఫొటోలు పెట్టి యువతను రెచ్చగొడుతున్నారు. ఇందుకు నెలకు రూ.499/రూ.599 చొప్పున వసూలు చేస్తున్నారు. ‘ఎక్స్‌క్లూజివ్’ అంటే ఏముంటుందో అనే ఆశతో చాలామంది యువకులు సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. దీంతో ఆయా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు.

Similar News

News September 22, 2025

భర్తలను కాపాడుకున్న భార్యలు!

image

భర్త ప్రాణాల్ని కాపాడుకొనేందుకు భార్య చూపే ప్రేమ, త్యాగాలకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నవీ ముంబైలో ప్రాణాంతక వ్యాధితో ఇద్దరు భర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ చేద్దామంటే కుటుంబీకుల రక్తం మ్యాచ్ అవ్వకపోవడంతో ఒకరి భర్త కోసం మరొకరు లివర్‌ను దానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ విజయవంతమై నలుగురూ క్షేమంగా ఉన్నారు. భార్యల త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.

News September 22, 2025

అందంగా.. ఆపదలో రక్షణగా!

image

పనుల కోసం బయటికెళ్లే యువతులు, మహిళల స్వీయ రక్షణ కోసం కొత్త తరహా వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. క్యాట్ ఇయర్ కీచైన్లు లేదా కిట్టి నకిల్స్ లేదా సెల్ఫ్ డిఫెన్స్ కీ చైన్ల పేరుతో ఆన్‌లైన్‌లో లభిస్తాయి. అందంగా ఉండే వీటిని కార్, స్కూటీ కీలకు, బ్యాగ్‌లు, పర్సులకు పెట్టుకోవచ్చు. అత్యవసర సమయాల్లో వీటి రంధ్రాల్లో వేళ్లని పెట్టి గ్రిప్ తెచ్చుకుని అవతలి వ్యక్తిని ప్రతిఘటించవచ్చు.
#ShareIt

News September 22, 2025

‘విజయవాడ ఉత్సవ్‌’కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

AP: నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ <<17789445>>ఉత్సవ్‌కు<<>> సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుర్గ గుడి భూముల్లో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. లీజ్‌కు తీసుకున్న వారికి, ఆలయానికి సమస్య లేనప్పుడు మూడో వ్యక్తికి అభ్యంతరమేంటని అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.