News March 26, 2025

యాడ్ ఫ్రీ ఇన్‌స్టా కోసం సబ్‌స్క్రిప్షన్.. ఎక్కడంటే?

image

యాడ్ ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ కోసం సబ్‌స్క్రిప్షన్‌ను తేవాలని ‘మెటా’ యోచిస్తోంది. తాజాగా యూరప్‌లో ఈ విధానాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. యూరోపియన్ నియంత్రణ సంస్థలకు ‘మెటా’ తన ప్రతిపాదలను పంపింది. మొబైల్‌లో యాడ్‌ఫ్రీ ఇన్‌స్టా కోసం నెలకు $14(రూ.1200), డెస్క్‌టాప్‌లో FB& INSTA కోసం 17 డాలర్ల వరకు ఉండనుంది. అక్కడ అమలైతే అన్నిచోట్లా తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News January 24, 2026

నిజామాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

image

ఉమ్మడి నిజామాబాద్ అర్హత కల్గిన నిరుద్యోగ SC, ST, BC, మైనారిటీ అభ్యర్థులకు నిజామాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 5 నెలల పాటు RRB, బ్యాంకింగ్, SSC, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు DD(SCDD) రాజగంగారం తెలిపారు. ఇందు కోసం ఆన్‌లైన్‌లో www.tsstudycircle.co.inలో జనవరి 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9951199460 సంప్రదించాలని సూచించారు.

News January 24, 2026

ట్రంప్ చేతికి గాయం.. అసలేమైంది?

image

చేతికి గాయంతో ట్రంప్ కనిపించడం చర్చనీయాంశమవుతోంది. 2 రోజుల కిందట దావోస్‌లో గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. అప్పుడు ఆయన చేతిపై గాయం కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా. టేబుల్ తగలడంతో గాయమైంది. దానికి క్రీమ్ రాశా. <<18737292>>గుండె ఆరోగ్యం<<>> బాగుండాలంటే ఆస్పిరిన్ తీసుకోవాలి. గాయాలు కావద్దనుకుంటే ఆస్పిరిన్ తీసుకోవద్దు’ అని ట్రంప్ అన్నారు.

News January 24, 2026

రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా?

image

రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్‌తో కలిపితే ఇంకా ఆలస్యం అవుతుందంటున్నాయి. దీంతో మేకర్స్ ముందుగా ప్రకటించిన మార్చి 27న రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదని చర్చించుకుంటున్నాయి. మే లేదా జూన్ నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.