News June 4, 2024

పరిటాల, దగ్గుపాటి, కోట్ల విజయం

image

AP: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత 22,196 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతపురం అర్బన్‌లో టీడీపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 20,879 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిని ఓడించారు. డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు.

Similar News

News January 9, 2026

ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

image

కోల్‌కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్‌<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్‌ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.

News January 9, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 9, 2026

శుభ సమయం (9-1-2026) శుక్రవారం

image

➤ తిథి: బహుళ షష్టి ఉ.10.26 వరకు ➤ నక్షత్రం: ఉత్తర సా.5.07 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.34-8.45 వరకు, ఉ.10.14-11.09 వరకు, తిరిగి మ.1.11-3.44 వరకు, సా.4.39-సా.5.34 వరకు ➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ➤ యమగండం: మ.3.00-4.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.46-9.30 వరకు, తిరిగి మ.12.26-1.10 వరకు ➤ వర్జ్యం: రా.1.59-3.40 వరకు ➤ అమృత ఘడియలు: ఉ.9.40-11.19 వరకు