News January 23, 2025
ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!
విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.
Similar News
News January 23, 2025
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.
News January 23, 2025
కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి తదితరులను కలుస్తారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. సాయంత్రానికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
News January 23, 2025
రికార్డు సృష్టించిన చైనా కృత్రిమ సూర్యుడు
చైనా కృత్రిమ సూర్యుడు.. ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1,000 సెకన్ల(16 నిమిషాలు)పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును 2006 నుంచి చేపడుతున్నారు. ఇందులో భారత్‌తోపాటు అమెరికా, రష్యా, జపాన్, సౌత్ కొరియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.