News August 17, 2025
అలాంటి సినిమాలను ఆపేయాలి: లోకేశ్

AP: సినిమాల్లో మహిళలపై వివక్షను కట్టడి చేసేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘మహిళలకు మనమిచ్చే గౌరవమే నిజమైన నాగరిక సమాజానికి పునాది. వారి పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను కట్టడి చేయాలి. అలాంటి డైలాగ్స్ ఉన్న మూవీ లేదా సీరియల్‌ను ఆపేయాలి. ఇంట్లో, స్క్రీన్‌పై చూసే అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News August 18, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: CBN
* దేశానికి జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేశ్
* ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలంటూ ప్రచారం.. టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
* TG: ఏపీలోనూ కాంగ్రెస్ బలపడుతుంది: భట్టి
* కాళేశ్వరం మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర: హరీశ్
* ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా C.P.రాధాకృష్ణన్
* ‘ఓటు చోరీ’ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ
News August 18, 2025
తిరుమలలో గందరగోళం జరగలేదు: TTD

తిరుమల క్యూలో గందరగోళం జరిగినట్లు వస్తున్న వార్తలను TTD ఖండించింది. వైరల్ అవుతోన్న వీడియో తోపులాటకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. భక్తులను సమూహాలుగా విభజించి తాళ్ల సాయంతో క్రమబద్ధీకరిస్తుండగా కొందరు ఉత్సాహంతో ముందుకు కదిలారని.. దాన్ని తోపులాట అని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. గత 3 రోజుల్లో 2.5 లక్షల మంది ఎలాంటి అంతరాయం లేకుండా స్వామివారిని దర్శించుకున్నారని వివరించింది.
News August 18, 2025
తోటి దర్శకులను ప్రశంసించలేరా?.. నెట్టింట విమర్శలు

రూ.1000 కోట్ల దర్శకులు వినోదం పంచితే తమిళ డైరెక్టర్లు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారన్న దర్శకుడు మురుగదాస్ <<17434441>>వ్యాఖ్యలు<<>> చర్చకు దారి తీశాయి. తోటి దర్శకుల ఘనతను ప్రశంసించలేకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నెటిజన్లు ఫైరవుతున్నారు. వినోదంతో పాటు అంతర్లీనంగా జీవిత పాఠాలను చెప్పే దర్శకులు ఉన్నారని అంటున్నారు. మురుగదాస్ తీసిన కొన్ని సినిమాలను ప్రస్తావిస్తూ.. వాటితో ఏం ఎడ్యుకేట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.