News March 22, 2024
అట్లుంటది విద్యార్థులతోని..

విద్యార్థుల జీవితంలో పరీక్షలు కీలకమైనవి. ముఖ్యంగా పది, ఇంటర్ పరీక్షల సమయంలో మంచి మార్కులు సాధించాలని సన్నద్ధమవుతారు. రోజుకు నాలుగైదు గంటలే నిద్రకు కేటాయించి మిగిలిన సమయాన్నంతా సాధనకే కేటాయిస్తారు. ఎంసెట్, JEE పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు ఈరోజు మళ్లీ రాదని భావించి కఠిన షెడ్యూల్ వేసుకొని చదువుతుంటారు. అలా ఓ JEE విద్యార్థి వేసుకున్న షెడ్యూల్ వైరలవుతోంది. మరి మీరూ ఇలా చదివారా.. కామెంట్ చేయండి
Similar News
News November 23, 2025
స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.
News November 23, 2025
URDIPలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

CSIR-యూనిట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్(URDIP) 3ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. కెమికల్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో పీజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల వారు డిసెంబర్ 16న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్సైట్: https://urdip.res.in/
News November 23, 2025
భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు. ☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ ☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం ☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.


