News April 17, 2024
అలాంటి వారిని చెప్పుతో కొడతా: హరీశ్ రావు

TG: తాను పార్టీ మారతానని దుష్ప్రచారం చేస్తున్నవారిని చెప్పుతో కొడతానని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ‘ఏక్నాథ్ షిండే నేను కాదు.. సీఎం రేవంతే. కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ ఉన్నా మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నా. రేవంత్ అన్ని హామీలు నెరవేర్చి తమకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
కృష్ణా: సొంతిల్లు లేదా.. మూడు రోజులే గడువు త్వరపడండి.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇల్లులేని 22,694 కుటుంబాలకు (NTRలో 15,994, కృష్ణాలో 6,700) PM AWAS+ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇంటి నిర్మాణానికి రూ.1.59 లక్షలు ఇస్తోంది. మొత్తం రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు సాయం అందనుంది. అర్హత ఉన్న పేదలు తమ వివరాలను సచివాలయాల్లో నమోదు చేసుకోవడానికి NOV 30వ తేదీ చివరి గడువని అధికారులు స్పష్టం చేశారు.
News November 27, 2025
టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. CTET నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ctet.nic.inలో నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 18, 2025. పరీక్ష ఫిబ్రవరి 8, 2026న జరుగుతుంది. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో 20 భాషల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో, రాష్ట్రస్థాయిలో టీచర్ ఉద్యోగాలు సాధించడానికి CTET అవకాశం కల్పిస్తుంది.
News November 27, 2025
బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.


