News June 19, 2024
ఇలాంటి వారు పైరసీ కన్నా డేంజర్: విశ్వక్ సేన్

కల్కి ట్రైలర్‌ను హాలీవుడ్ చిత్రాలతో పోలుస్తూ ఓ యూట్యూబర్ ఇచ్చిన రివ్యూపై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇలాంటి వారు పైరసీ కన్నా డేంజర్ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఆదాయం కోసం యూట్యూబ్‌లో సమీక్షలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి అభిప్రాయాలు చెప్పేవారు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని సవాల్ చేశారు. అప్పుడైనా సినీ కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 26, 2026
చిరు, నాగబాబును అన్నయ్య అనే పిలుస్తా: అన్నా కొణిదెల

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు అన్నదమ్ములు లేరని, కానీ పెళ్లై కొణిదెల ఫ్యామిలీలోకి వచ్చాక చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం భర్త నుంచి అలవాటైందని పేర్కొన్నారు. వరుసల పరంగా పిలుపులు వేరైనా.. మనసుతో వారిని తన సొంత సోదరులుగానే భావిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు. మెగా బ్రదర్స్‌పై ఆమె చూపిన ఈ అనురాగం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
News March 26, 2026
మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిలాపియా రకం చేపలను పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
News March 26, 2026
కల్తీ పాల ఘటన.. CS, DGPకి NHRC నోటీసులు

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) సుమోటోగా తీసుకుంది. ఈ ఉదంతంపై రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ఘటనలో 16 మంది <<19447985>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. ఇప్పటికీ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


