News October 21, 2024

అలాంటి వారు ఇక‌ నో ఫ్లై జాబితాలో: రామ్మోహ‌న్ నాయుడు

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా ప‌రిగ‌ణించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టిదాకా 75 సంస్థ‌ల‌కు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేర‌క‌మైన భాష‌ను ఉప‌యోగిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

Similar News

News October 21, 2024

US కంటే ఇండియా మార్కెట్ల పనితీరు భేష్: మార్క్ మోబియస్

image

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే వర్ధమాన మార్కెట్లు రెండింతల వృద్ధి రేటు సాధిస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ తెలిపారు. అమెరికా మార్కెట్ల కంటే ఇండియా మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు. ‘భవిష్యత్తులో సెమీకండక్టర్ ప్రొడక్షన్‌లో భారత్ లీడర్‌గా ఎదుగుతుందనే నమ్మకముంది. అనేక పెద్ద సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నాయి’ అని NDTV సమ్మిట్‌లో పేర్కొన్నారు.

News October 21, 2024

కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో గంటలో హైదరాబాద్ నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు. అలాగే భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో వానలు పడుతాయని అంచనా వేశారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

News October 21, 2024

బీఎస్సీ(ఆనర్స్) సీట్ల సంఖ్య పెంపు

image

TG: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ(ఆనర్స్) సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో అదనంగా 200 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ అవసరాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక కోటాలో ఉన్న ఈ కోర్సు ఫీజును రూ.10లక్షల నుంచి రూ.5లక్షలకు తగ్గించింది.