News January 30, 2025
హీరోయిన్లతో అలాంటి సీన్లు.. హీరో సిద్ధార్థ్ ఏమన్నారంటే?

హీరో సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లను కొట్టే సీన్లు, వారిని అసభ్యంగా తాకే సన్నివేశాలు, ఐటెమ్ సాంగ్స్ ఉన్నాయని పలు సినిమాలను వదులుకున్నట్లు చెప్పారు. ఒకవేళ తాను ఎలాంటి నిబంధనలు లేకుండా చేస్తే పెద్ద స్టార్ అయ్యి ఉండేవాడినన్నారు. తాను ఎంపిక చేసుకునే సినిమాల పట్ల గర్వంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సినిమాల్లో అగ్రెసివ్‌గా నటిస్తారని తనకు మాత్రం ఏడ్చే సీన్లలో చేయడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News October 18, 2025
పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) వారెంట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో హంగేరీ వేదికగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్‌తో భేటీ అయ్యాక ఆయనను అదుపులోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని సమాచారం. ICCకి అరెస్ట్ చేసే అధికారం లేదు. అందులోని సభ్యదేశాలే ఈ పనిచేయాలి. కాగా పుతిన్‌కు భద్రత కల్పిస్తామని హంగేరీ PM చెప్పడం గమనార్హం.
News October 18, 2025
విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

AP: VSP పార్ట్నర్షిప్ సమ్మిట్‌పై భారీ అంచనాలున్నాయి. పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు CBN, లోకేశ్ విదేశాలకు వెళ్తున్నారు. గూగుల్, TCS వంటి సంస్థల రాకతో ఈసారి పెట్టుబడులు పెరగొచ్చంటున్నారు. కాగా 2016లో ₹7.03L Cr, 2017లో ₹6.98L Cr, 2018లో ₹3.10L Cr పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో పెండింగ్ అంశాల్ని పట్టాలెక్కించడంతో పాటు ఈసారి కొత్తవారిని ఆహ్వానించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News October 18, 2025
కమ్యూనిటీ బయింగ్: 186 కార్లకు ₹21 కోట్ల డిస్కౌంట్!

షాపింగులో బల్క్‌గా కొంటే ఏమైనా తగ్గిస్తారా అని బేరమాడటం చూస్తుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యూనిటీ సభ్యులు దీనిని వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. ఏకంగా 186 లగ్జరీ కార్లను ఒకే డీల్‌లో కొనుగోలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ కార్ల విలువ ₹149.54 కోట్లు కాగా, వారు రూ.21.22 కోట్లు డిస్కౌంట్ పొందడం విశేషం. ఒకే కమ్యూనిటీకి చెందినవారు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి లగ్జరీ కార్లను కొనడం దేశంలోనే చర్చనీయాంశమైంది.