News August 20, 2025

అలాంటి సాదా బైనామాలు చెల్లుతాయి: AG

image

TG: సాదా బైనామాలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. 12 ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉండి, ప్రభుత్వం నిర్దేశించినట్లు రాత‌పూర్వక ఒప్పందం ఉంటే సాదా బైనామాలు చెల్లుతాయని AG కోర్టుకు వివరించారు. 2020లో సాదా బైనామాలను ఆపాలన్న మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. అడ్వకేట్ జనరల్ కౌంటర్‌కు రిప్లై ఇచ్చేందుకు పిటిషనర్లు సమయం కోరడంతో విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది.

Similar News

News August 21, 2025

విజ్డన్ ప్లేయర్స్‌లో నంబర్ వన్‌గా జైస్వాల్

image

ప్రపంచంలోనే బెస్ట్ యంగ్ ప్లేయర్‌గా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ నిలిచారు. విజ్డన్ టాప్-40 ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ టాప్‌లో నిలిచారు. సాయి సుదర్శన్ (9), నితీశ్ (12), తిలక్ వర్మ (14), వైభవ్ (16), హర్షిత్ (21), పరాగ్ (27), ముషీర్ (31), మయాంక్ (33) స్థానాలు దక్కించుకున్నారు. టాప్-10లో జేడెన్ సీల్స్, బెతేల్, ఒరూర్కీ, ప్రిటోరియస్, నసీమ్ షా, గుర్బాజ్, మఫాకా, ఇబ్రహీం జద్రాన్ నిలిచారు.

News August 21, 2025

శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

image

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News August 21, 2025

ఆగస్టు 21: చరిత్రలో ఈ రోజు

image

1914: సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు జననం
1963: నటి రాధిక జననం
1978: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ మరణం
1978: నటి భూమిక చావ్లా జననం
1986: జమైకన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ జననం
1998: హీరోయిన్ డింపుల్ హయాతి జననం
2013: ‘సాహిత్య అకాడమీ’ గ్రహీత మాలతీ చందూర్ మరణం
* జాతీయ వృద్ధుల దినోత్సవం