News April 24, 2024

అలాంటివి ఎప్పుడూ సక్సెస్ కావు: కేసీఆర్

image

TG: తన ఆనవాళ్లు లేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కొందరు చెప్పారని అది సాధ్యమేనా అని కేసీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో లేనప్పుడు నామరూపాలు లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. అదో వికృతమైన ఆలోచన అని దుయ్యబట్టారు. ఎవరికైనా టైమ్ వస్తుందన్నారు. ప్రజల ఆలోచన సరళిని మార్చినప్పుడు ఫలితం ఇలా ఉంటుందని తెలిపారు. కృత్రిమంగా, వికృతంగా చేసే ఆరోపణలు చరిత్రలో ఎప్పుడూ సక్సెస్ కావన్నారు.

Similar News

News March 12, 2026

పాపం జెన్‌జీలు

image

జెన్‌జీల జీవితం ఎమోషనల్ మూవీని తలపిస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో కొవిడ్ లాక్డౌన్లు అడ్డుపడగా.. కెరీర్ మొదలుపెట్టే వేళ AI సవాలు విసురుతోంది. ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఇక పెళ్లి చేసుకుందామంటే పెరుగుతున్న విడాకుల శాతం భయపెడుతోంది. అటు కెరీర్ టెన్షన్లు, ఇటు సామాజిక ఒత్తిళ్లతో ఈ తరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీరి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.

News March 12, 2026

PHOTO: నాగచైతన్య సిక్స్‌ప్యాక్‌

image

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో ‘అర్జున్’ అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం చైతూ తన బాడీని పూర్తిగా మార్చేశారు. తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న షర్ట్‌లెస్ ఫొటో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో హారర్, మైథలాజికల్ అంశాలతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ‘చైతూ పడ్డ కష్టానికి ఈ సారి హిట్ పక్కా’ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

News March 12, 2026

జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించినప్పుడే అసలైన కిక్కు: బుమ్రా

image

టీ20 WC విజయం తర్వాత తన మనసులోని మాటను టీమ్ఇండియా ప్లేయర్ బుమ్రా పంచుకున్నారు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేయడం తనకిష్టమైన సవాలని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ బౌలింగ్ చేసి INDను గెలిపించినప్పుడు వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేనిదన్నారు. ‘నేను ఎప్పుడూ కష్టమైన పనులనే ఇష్టపడతా. అందుకే క్రికెట్ ఆడటం మొదలుపెట్టా’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుమ్రా ఫైనల్‌లో 4 వికెట్లు తీసి ‘POTM’గా నిలిచారు.