News March 13, 2025
త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.
Similar News
News November 22, 2025
WNP: ఉచిత చీరల పంపిణీ సంతోషకరం: కలెక్టర్

ప్రతి ఒక్క మహిళకు ఉచిత చీర ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని, సంఘంలో లేనివారిని సైతం చేర్చుకొని ఇస్తామని తెలిపారు. మహిళా సంఘాల కోసం పెబ్బేరులో పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నాయని ఆమె పేర్కొన్నారు.

GWL: పదోన్నతి బాధ్యతను పెంచుతుంది: ఎస్పీ

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుందని ఎస్పీ టి.శ్రీనివాసరావు అన్నారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జి.కృష్ణయ్య ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందిన సందర్భంగా శుక్రవారం గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కొత్తగా పదోన్నతి పొందిన ఏఆర్ ఎస్సైకి స్టార్ తొడిగి అభినందనలు తెలిపారు.