News August 23, 2025
సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) అనారోగ్యంతో <<17489969>>కన్నుమూసిన<<>> సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం నుంచి మ.3 గంటల వరకు హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతిక కాయాన్ని ఉంచి, అనంతరం గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News March 27, 2026
NZB: ట్రావెల్స్ బస్సుల్లో వెళ్తున్నారా..?

మార్కాపురం ఘోర ప్రమాదం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కామారెడ్డిల నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు నిత్యం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో అధిక శాతం ఫిట్‌నెస్ లేకపోవడం, అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. గతంలో ఇందల్వాయి, భిక్నూర్ వద్ద జరిగిన ప్రమాదాలు నిర్లక్ష్యాన్ని చాటిచెప్పాయి.
News March 27, 2026
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై గిల్ ఏమన్నారంటే..

IPLలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ వల్ల క్రికెట్‌లో అసలైన నైపుణ్యం దెబ్బతింటోందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ 11 మంది ఆడే ఆట అని, ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను చేర్చడం వల్ల గేమ్ వన్ సైడ్‌గా మారుతుందని పేర్కొన్నారు. భారీ స్కోర్ల కంటే సవాల్‌తో కూడిన వికెట్లపై ఆడే మ్యాచ్‌లే థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. రోహిత్, హార్దిక్, అక్షర్ కూడా ఈ రూల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
News March 27, 2026
45 ఏళ్లకే ₹కోటితో రిటైర్‌మెంట్: ఏం చేయాలి?

30 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి 45 ఏళ్లకు రిటైర్ అవ్వడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నెలకు ₹14,500 ఇన్వెస్ట్ చేస్తూ 15 ఏళ్లలో ₹1 కోటి సంపాదించొచ్చు. ఇందులో ₹5,000 గోల్డ్‌లో, ₹9,500 MFలో పెట్టాలి. ఏటా పెట్టుబడిని 10% పెంచుతూ వెళ్తే కాంపౌండింగ్ పవర్‌తో మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. గోల్డ్ ద్వారా సుమారు ₹20 లక్షలు, MF ద్వారా ₹82 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.


