News August 25, 2024

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. KBCలో రూ.50లక్షలు గెలుచుకుంది

image

బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌తి కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నారు. రాజ‌స్థాన్‌కు చెందిన న‌రేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో చికిత్స కోసం ప్ర‌తి రూపాయిని కూడ‌బెడుతూ వ‌చ్చారు. తాజాగా KBCలో రూ.50 ల‌క్ష‌లు గెలుచుకున్నారు. పైగా చికిత్సకు బాధ్య‌త తీసుకుంటాన‌ని హోస్ట్ అమితాబ్ హామీ ఇచ్చారు.

Similar News

News March 4, 2026

యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఖతర్‌లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్‌‌ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్‌స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్‌గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్‌పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

News March 4, 2026

ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

image

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.

News March 4, 2026

మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్ షాకు సీఎం రిపోర్ట్

image

ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌ షాతో సీఎం రేవంత్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చారు. ఆపరేషన్‌ కగార్‌కు తెలంగాణ పోలీసులు సహకరించారని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని షా కోరారు. తెలంగాణలో ఈగల్‌ టీమ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటు గురించి రేవంత్ వివరించారు. రాష్ట్రానికి IPS క్యాడర్‌ను పెంచాలని కోరారు.