News November 4, 2024
తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ

AP: తనకు ప్రమాదం జరిగిందనే ప్రచారంపై విజయమ్మ స్పందించారు. ‘ఈ ప్రచారంతో నాకు తీవ్ర వేదన కలుగుతోంది. నేను ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన కారు ప్రమాదాన్ని ఇప్పుడు నా కుమారుడికి ఆపాదించి దుష్ప్రచారం చెయ్యడం జుగుప్సాకరం. నేను నా మనవడి దగ్గరకు వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు. ఇవన్నీ AP ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారు’ అని ఆమె లేఖ విడుదల చేశారు.
Similar News
News November 24, 2025
BHPL: 61 దరఖాస్థులను స్వీకరించిన అదనపు కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఐడీవోసీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజల నుంచి 61 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 24, 2025
ఐబొమ్మ రవి.. విచారణలో సంచలన విషయాలు!

ఐబొమ్మ రవి మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇవాళ అతడి మాజీ భార్యనూ పోలీసులు విచారించారు. తనతో పాటు కూతురిని చిత్రహింసలకు గురిచేశాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. రవి ప్రవర్తన నచ్చకనే విడాకులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. స్నేహితుడు నిఖిల్కు నెలకు రూ.50వేలు ఇచ్చి ఐబొమ్మ సైట్ పోస్టర్లు డిజైన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు.
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.


