News July 8, 2025
జీరో కేలరీలు ఉండే షుగర్ మొక్క.. ఇంట్లోనే పెంచుకోవచ్చు!

షుగర్ కంటే దాదాపు 300రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉండే మొక్క ఒకటుంది. అదే ‘స్టీవియా రెబౌడియానా’. దీని ఆకుల నుంచి స్టీవియాను(స్వీట్నర్) తీస్తారు. ‘స్వీట్ లీఫ్’ అని పిలిచే వీటి ఆకులలో స్టీవియోసైడ్ & రెబౌడియోసైడ్ వంటి సమ్మేళనాలు అధిక తీపిని కలిగి ఉంటాయి. ఇందులో కేలరీలు ఉండవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. షుగర్ ఫ్రీ ఉత్పత్తుల్లో దీనిని వాడుతుంటారు. నర్సరీ/ఆన్‌లైన్‌లో లభించే వీటిని ఇళ్లలోనూ పెంచుకోవచ్చు.
Similar News
News February 7, 2026
రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.

ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.