News October 1, 2024
ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళనకరం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను తొలగించి మిమ్మల్ని మానసికంగా దృఢంగా మార్చేందుకు కేంద్రం ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-0019కు కాల్ చేయాలి. ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి మానసిక ఆరోగ్య సేవలను ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. >>SHARE IT
Similar News
News September 19, 2025
శుభ సమయం (19-09-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ త్రయోదశి రా.11.51 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష ఉ.8.49 వరకు
✒ శుభ సమయములు: ఉ.10.08-ఉ.10.38, సా.5.45-సా.6.10
✒ రాహుకాలం: మ.10.30-మ.12.00
✒ యమగండం: మ.12.24-మ.1.12
✒ దుర్ముహూర్తం: ఉ.8.24.00-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: రా.8.57-రా.10.33
✒ అమృత ఘడియలు: ఉ.7.12-ఉ.8.46
News September 19, 2025
టుడే టాప్ స్టోరీస్

* జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి: CM చంద్రబాబు
* ఢిల్లీకి సీఎం రేవంత్.. పెట్టుబడులపై కంపెనీల ప్రతినిధులతో రేపు భేటీ
* ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్
* నకిలీ ఓట్ల వెనుక ఎవరున్నారో తెలియాలి: రాహుల్ గాంధీ
* ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారింది: BJP
* OCT 1 నుంచి అమల్లోకి ఆన్‌లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
News September 19, 2025
బగ్రామ్ ఎయిర్‌బేస్ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్‌బేస్‌కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.