News March 16, 2024
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు జవాన్ల మృతి

పాకిస్థాన్‌లోని నార్త్ వజిరిస్థాన్ సెక్యూరిటీ చెక్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ఆర్మీ అధికారులతోపాటు ఆరుగురు టెర్రరిస్టులు మరణించారు. టెర్రరిస్టులు పేలుడు సామగ్రితో కూడిన వాహనంతో వచ్చి చెక్‌పోస్టును ఢీకొట్టి పేల్చేశారు. తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా సైనికులు కాల్చేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 20, 2026
సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలంటే?

సీడ్ సైక్లింగ్‌లో పీరియడ్ 1-14 రోజు వరకు రోజుకు అవిసె, గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవాలి. 14వ రోజు నుండి పీరియడ్స్ మొదటి రోజు వరకు రోజుకు పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలను తీసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్‌లో మొదటి 14 రోజులు ఫోలిక్యులర్ దశ, తర్వాత లూటియల్ దశ ఉంటాయి. ఆ సమయానికి తగ్గట్లు సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు సమతుల్యతతో ఉంటాయి.
News January 20, 2026
మెగా హీరోతో మారుతి మూవీ.. క్లారిటీ!

డైరెక్టర్ మారుతి తర్వాతి మూవీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో మెగా హీరోతో చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది. మారుతి తర్వాతి సినిమాపై అధికారికంగా ప్రకటన చేస్తామని పేర్కొంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ మూవీ ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.
News January 20, 2026
CRPF పురుషుల బృందాన్ని నడిపించనున్న మహిళా అధికారి!

రిపబ్లిక్ డే కవాతులో చరిత్ర సృష్టించేందుకు CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా(26) సిద్ధమవుతున్నారు. J&Kకు చెందిన ఈ అధికారి తమ పురుష దళానికి నాయకత్వం వహించనున్నారు. CRPFలో 140 మందితో కూడిన మేల్ కమాండ్‌ను లేడీ ఆఫీసర్ లీడ్ చేయడం ఇదే తొలిసారి. రాజౌరి(D) నుంచి ఆఫీసర్ ర్యాంకులో చేరిన తొలి మహిళ కూడా బాలానే కావడం విశేషం. 2020లో ఆర్మీ డే పరేడ్‌ను లీడ్ చేసిన మొదటి మహిళగా తానియా షేర్ గిల్ నిలిచారు.


