News July 18, 2024
SUICIDE PODS: నొప్పి లేకుండా నిమిషంలోనే ఆత్మహత్య

నొప్పి లేకుండా హాయిగా ఆత్మహత్య చేసుకునేందుకు స్విట్జర్లాండ్ ఓ సూసైడ్ క్యాప్సూల్ తయారు చేసింది. నైట్రోజన్ నింపిన ఈ క్యాప్సూల్లో పడుకుని బటన్ నొక్కిన నిమిషంలోనే చనిపోతారు. స్విట్జర్లాండ్లో దీనిని మొట్టమొదటిసారి ఉపయోగిస్తున్నారు. దీనిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలన్న వారి అభ్యర్థన మేరకే దీనిని ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించేందుకు రూ.1671 చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News January 29, 2026
రేపే ఓటీటీలోకి ధురంధర్

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బాలీవుడ్ సినిమా ‘ధురంధర్’ ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 30 (శుక్రవారం) నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. రన్ టైమ్ 3 గం. 25 ని.లుగా ఉండనుంది. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,300 కోట్లు వసూలు చేసింది.
News January 29, 2026
ఇండియన్ నేవీలో 260 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News January 29, 2026
‘పంచాంగం’లో ఏం ఉంటాయో మీకు తెలుసా?

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల సమాహారమే పంచాంగం. మన తెలుగువారు చంద్రుడి గమనాన్ని బట్టి రూపొందించిన చాంద్రమాన పంచాంగాన్ని అనుసరిస్తారు. తిథి సంపదను, వారం ఆయుష్షును, నక్షత్రం పాపహరణాన్ని, యోగం రోగనివారణను, కరణం కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. శుభకార్యాలకు ముహూర్తాలు చూసుకోవడానికి, వర్జ్యం, అమృతఘడియలను తెలుసుకోవడానికి పంచాంగం ఎంతో అవసరం. ఇది మన దైనందిన జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపిస్తుంది.


