News August 29, 2024
జనాభా పెరుగుదల రేటు కన్నా ఆత్మహత్యల రేటు అధికం: రిపోర్ట్

భారత్లో ఏడాదికి సగటున జనాభా పెరుగుదల రేటు కన్నా స్టూడెంట్స్ సూసైడ్ రేటు ఎక్కువగా ఉన్నట్లు NCRB నివేదిక వెల్లడించింది. 2 దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యలు 4% పెరిగినట్లు పేర్కొంది. MH, తమిళనాడు, MPలోనే ఈ సంఖ్య అత్యధికమని తెలిపింది. మానసిక పరిస్థితులు ఇతర అంశాలు కారణాలుగా ఉన్నాయంది. నియంత్రణకు విద్యార్థులకు కాలేజీల్లో క్రమబద్దమైన కౌన్సెలింగ్ వ్యవస్థను రూపొందించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


