News June 30, 2024
మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్

మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ IAS సుజాతా సౌనిక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర 64 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఈమె హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో CSగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Similar News
News December 4, 2025
HYD సీపీ ఎమోషనల్ పోస్ట్

డబ్బు మత్తులో.. బంధాలు ఛిద్రం అవుతున్నాయని నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగులో రూ.4 కోట్లకు బీమా చేయించి అన్నను తమ్ముడు ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై సజ్జనార్ స్పందించారు. ‘ఏ బ్యాంక్ బ్యాలెన్స్ గుండె చప్పుడును కొనలేదు. ఏ బీమా పాలసీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేదు’ అని పేర్కొన్నారు.
News December 4, 2025
ఇండియాలో పుతిన్‌ను అరెస్టు చేస్తారా?

ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) 2023లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం ICCలో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు పుతిన్‌ను అరెస్టు చేసే అధికారం ఉంది. అందుకే పుతిన్ ఆ దేశాలకు వెళ్లరు. వాటి ఎయిర్‌స్పేస్ కూడా వాడుకోరు. భారత్ ICC సభ్యదేశం కాదు. ఒకవేళ పుతిన్‌ను అప్పగించాలని ICC కోరినా భారత్.. రష్యాతో స్నేహం వల్ల అందుకు తిరస్కరించే అవకాశమే ఎక్కువ.
News December 4, 2025
CBSE నోటిఫికేషన్.. 124 పోస్టులు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ పాసై ఉండాలి. వయసు 27-35 ఏళ్లు. <


