News October 18, 2024
‘OG’ సెట్‌లో సుజీత్, తమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా షూటింగ్ సెట్‌లో డైరెక్టర్ సుజీత్‌తో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, DOP రవి కే చంద్రన్ డిస్కస్ చేస్తోన్న ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సమయాన్ని బట్టి పవన్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇటు హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది.
Similar News
News October 28, 2025
ఆర్టీసీలో 1,743 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TGSRTCలో 1,743 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.tgprb.in/
News October 28, 2025
చైనాలో ‘రీల్’ చేయాలంటే.. డిగ్రీ ఉండాల్సిందే!

డిగ్రీ ఉంటేనే సోషల్ మీడియా రీల్స్ చేసేలా చైనా కొత్త నిబంధన తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మెడిసిన్, లా, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ వంటి అంశాలపై వీడియోలు చేయాలంటే ఆయా సబ్జెక్టులపై వారు డిగ్రీ చేసి ఉండాలి. అలాగే SM ప్లాట్‌ఫామ్స్ కూడా వారి డిగ్రీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. రూల్స్ పాటించని వారి ఖాతాలను డిలీట్ చేయడమే కాకుండా రూ.12 లక్షల వరకు ఫైన్ విధిస్తారు.
News October 28, 2025
నేడు అత్యంత భారీ వర్షాలు

AP: ‘మొంథా’ తుఫాను తీరం వైపు వేగంగా కదులుతోంది. దీంతో నేడు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం-నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సాయంత్రం/రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 90-110Kmph వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.


