News December 25, 2024
మరోసారి కిమ్స్‌కు వెళ్లనున్న సుకుమార్, దిల్ రాజు?

కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్, దిల్ రాజుతో కలిసి ఇవాళ మరోసారి పరామర్శిస్తారని తెలుస్తోంది. మ.2 గంటలకు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీతేజ్ కుటుంబానికి సాయంపై బాలుడి తండ్రి భాస్కర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రేవతి భర్తకు దిల్ రాజు ఉద్యోగ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News December 10, 2025
దిగుబడి పెంచే నానో ఎరువులను ఎలా వాడాలి?

దశాబ్దాలుగా సాగులో ఘన రూపంలో యూరియా, DAPలను రైతులు వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూప నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటి వాడకం వల్ల ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90% గ్రహించి, దిగుబడి పెరిగి.. పెట్టుబడి, గాలి, నేల కాలుష్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. నానో ఎరువులను ఎలా, ఎప్పుడు, ఏ పంటలకు వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 10, 2025
వణికిస్తున్న చలి.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3-4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 °C తక్కువగా నమోదవుతాయని HYD IMD తెలిపింది. ఇవాళ, రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, NML, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత అత్యల్పంగా ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 6.1°C నమోదైంది. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<


