News November 17, 2024
‘పుష్ప 2’ ఈవెంట్కు సుకుమార్ దూరం.. ఎందుకంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంఛ్ రేపు పట్నాలో జరగనుంది. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటంతో వాటిని ఫినిష్ చేసేందుకు ఆయన హైదరాబాద్లోనే ఉంటారని సమాచారం. మరోవైపు రేపటి ఈవెంట్లో బిగ్ బాస్ ఫేమ్ అక్షర్ సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వచ్చే నెల 5న మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News December 14, 2025
ISIS దాడిలో ముగ్గురు అమెరికన్ల మృతి.. ట్రంప్ వార్నింగ్

సెంట్రల్ సిరియాలో ఐసిస్ చేసిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ఉన్నారు. ఈ ఘటనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా, సిరియాపై జరిగిన దాడి అని, బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైనట్లు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News December 14, 2025
ఓటుకు రూ.40వేలు.. రూ.17 కోట్ల ఖర్చు?

TG: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచేందుకు రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.40వేల చొప్పున పంచడమే కాకుండా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వెండిగ్లాసులు, బంగారు నగలు పంపిణీ చేశారని తెలుస్తోంది. మద్యం పంపిణీకే రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అటు మరికొన్ని చోట్ల గెలిచేందుకు అభ్యర్థులు రూ.లక్షల్లో వెచ్చించినట్లు సమాచారం.
News December 14, 2025
బాలకృష్ణ, బోయపాటి.. 4 సినిమాల్లో ఏది నచ్చింది?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే యాక్షన్ భారీ స్థాయిలో ఉంటుంది. హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు 4 సినిమాలొచ్చాయి. సింహా(2010), లెజెండ్(2014), అఖండ(2021), అఖండ-2: తాండవం(2025) మాస్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాల్లో బాలకృష్ణ గెటప్స్, డైలాగ్స్, ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. మరి వీటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి.


