News December 23, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగజెఱువు నిండిన
గప్పలు పదివేలుజేరుగదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలకొద్దీ కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అలాగే మనకు ఎప్పుడైతే సంపద చేకూరుతుందో అప్పుడు బంధువులు వస్తారు.

Similar News

News February 13, 2026

భగ్గుమంటున్న ధరలు

image

దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతోంది. JANలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. రాష్ట్రాల వారీగా TGలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో AP ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.

News February 13, 2026

ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.

News February 13, 2026

శివుడి మెడలో పుర్రెల దండ ఎందుకంటే

image

వర గర్వంతో విర్రవీగుతున్న రాక్షసులను అదుపు చేయడానికి మహావిష్ణువు సూచనతో శివుడు ఈ భీకర రూపాన్ని ధరించాడు. వారిని చెడు మార్గం నుంచి మళ్లించి, వారి ఆత్మతేజస్సును తగ్గించడం ద్వారా దేవతలను రక్షించాడు. ఇది కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు. ధర్మాన్ని నిలబెట్టడానికి హరిహరులు చేసిన సంయుక్త ప్రయత్నం. అలాగే, ఇది జీవితం శాశ్వతం కాదని, అంతిమంగా అంతా శూన్యమని తెలిపే వైరాగ్యానికి ప్రతీక.