News February 4, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుజనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యలేని నీచుడి దగ్గరకు వెళ్లకూడదు. వాటి వల్ల ప్రమాదం ఉంటుంది.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


