News October 30, 2024
సుమతీ నీతి పద్యం.. తాత్పర్యం
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తాత్పర్యం: కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు. ఆ బిడ్డ గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నపుడు తండ్రికి నిజమైన ఆనందం వస్తుంది.
Similar News
News November 19, 2024
ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి!
అతిగా ఆలోచించి <<14648968>>చింతించడం<<>> కూడా ఓ ఆరోగ్య సమస్యేనని వైద్యులంటున్నారు. ఇది మిమ్మల్ని ప్రతికూల విషయాలపై దృష్టి సారించేలా చేస్తుంది. దీనిని అధిగమించాలంటే ఇష్టమైన ఆహారం తీసుకోవాలి. దీని వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి ఉండండి. రోజూ యోగా చేయండి. కంటినిండా నిద్రపోండి. వీలైనంత వరకూ మొబైల్‌కు దూరంగా ఉండండి. సక్సెస్ స్టోరీ బుక్స్ చదవండి. హ్యాపీగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.
News November 19, 2024
‘కాళేశ్వరం’పై విచారణ.. ఈనెలాఖరున KCRకు పిలుపు!
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్‌కుమార్, రజత్‌కుమార్, స్మితా సబర్వాల్, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
News November 19, 2024
భారత్ ఫైబర్ (BSNL)పై పెరుగుతోన్న ఆసక్తి!
BSNLలో 5G అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు ఈ నెట్‌వర్క్‌లోకి మారేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. అలాగే భారత్ ఫైబర్ (తక్కువ ధరకే WiFi)పైనా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దేశంలో మొత్తం 28.8 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడులోనే దాదాపు 9లక్షల కనెక్షన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక APలో 1.7లక్షలు, TGలో 0.9లక్షల కనెక్షన్లున్నాయి.