News October 31, 2024
సుమతీ నీతి పద్యం: ఎవడు నేర్పరి?

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నకజేయువాడె నేర్పరి సుమతీ!
తాత్పర్యం: మనకు ఉపకారము చేసిన వారికి తిరిగి ఉపకారము చేయుట మంచి లక్షణము. అయితే అందులో ప్రత్యేకత లేదు. కానీ అపకారము చేసిన వారికి కూడా మంచి చేయగలిగినవాడే నేర్పరి అనిపించుకుంటాడు.
Similar News
News February 1, 2026
పశువులకు పోషకాలను అందించే అవిశ

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News February 1, 2026
మాఘ పౌర్ణమి విశిష్టత

పురాణాల ప్రకారం.. ఈరోజే గౌరీ దేవి జన్మించింది. అలాగే శ్రీమహావిష్ణువు స్వయంగా గంగానదిలో కొలువై ఉంటాడని నమ్మకం. ఈరోజున సముద్రంలో లేదా పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పవిత్రమైన నీటితో స్నానం చేస్తూ విష్ణువును, సూర్య భగవానుడిని స్మరించుకోవాలని సూచిస్తున్నారు. పితృదేవతలకు తర్పణాలు వదిలితే దోషాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని మాఘ పురాణం చెబుతోంది.
News February 1, 2026
Budget 2026: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 25,298 వద్ద, సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 82,294 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌లో సన్ ఫార్మా, బీఈ, పవర్ గ్రిడ్, NTPC, HDFC, యాక్సిస్, కోటక్ బ్యాంకు షేర్లు లాభాల్లో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, జొమాటో, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


