News July 28, 2024
టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో సుమిత్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ మెన్స్ సింగిల్స్ విభాగంలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. తొలి రౌండ్లోనే సుమిత్ నాగల్ పోటీ నుంచి నిష్క్రమించారు. ఫ్రాన్స్‌కు చెందిన కోరెంటిన్ మౌటెట్ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఆయన పరాజయం చెందారు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్స్‌లో మహిళల ఆర్చరీ జట్టు నెదర్లాండ్ చేతిలో ఓటమి చవి చూసింది.
Similar News
News January 26, 2026
10వేల కిలోల పేలుడు పదార్థాలు.. రిపబ్లిక్ డే వేళ కలకలం

రిపబ్లిక్ డే ముందు రాత్రి రాజస్థాన్‌లో భారీగా పేలుడు <<18942074>>పదార్థాలు<<>> పట్టుబడటం కలకలం రేపింది. నాగౌర్(D) హార్సౌర్‌లోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు 10వేల KGs అమ్మోనియం నైట్రేట్ బ్యాగులు, డిటోనేటర్లు గుర్తించారు. సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాటిని ఎందుకు నిల్వ చేశాడు? క్రిమినల్ హిస్టరీ ఉన్న అతడికి ఇతర రాష్ట్రాల వారితో లింక్‌లు ఉన్నాయా? అనే కోణంలో ఇంటరాగేట్ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
News January 26, 2026
భీష్మాష్టమి పూజా విధానం

ఈ పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. శాంతికి చిహ్నమైన తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. విష్ణుమూర్తిని తామర పూలు, తులసి దళాలతో అర్చించాలి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండాలి. జాగరణ చేయాలి. తామర వత్తులతో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణంతో ఇంటికి శుభం కలుగుతుంది. పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం అందించడం ఎంతో శ్రేష్ఠం.
News January 26, 2026
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.


